ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన జవాను.. వైరల్ వీడియో!

సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యురిటీ ఫోర్స్ కు చెందిన ఓ జవాను బాలికను కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఎంతో సురక్షితంగా ఆ పాపను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించాడు. కాలు జారినా కింద పడేలా ఉండే ఆ ప్రాంతంలో ఒక చేతితో పాపను మోస్తూ… మరో చేతితో బరువును ఆపుకుంటూ వచ్చారు. ఏ మాత్రం కాలు జారినా కానీ ప్రమాదం జరిగేలా ఉండే దగ్గర తన దైన శైలిలో ముందుకు సాగి పాపను రక్షించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది.

CISF jawan rescues girl stuck in iron grill at Delhi Metro station
CISF jawan rescues girl stuck in iron grill at Delhi Metro station

పాపకు ఎలాంటి హానీ జరగకుండా చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు ఆ జవాను. ఈ ఘటన ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేష‌న్‌ లో జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ పాప అక్కడే ఉండి ఆడుకుంటూ ఉంది. అయితే మెట్రోస్టేషనల్​ లో ఉండే ఓ నిషేధిత ప్రాంతంలోకి పాప వెళ్లిపోయింది. అనుకోకుండా అక్కడ చిక్కుకున్న పాపను అక్కడున్న వారు కొందరు చూసారు. ఈ క్రమంలోనే ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అవ్వలేదు. పక్కన ఉన్న సెక్యురిటీ సిబ్బందికి విషయం తెలియజేయగా.. సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యురిటీ ఫోర్స్ కు చెందిన ఓ జవాను రంగంలోకి దిగాడు. పాపను కచ్చితంగా సదరు తల్లిదండ్రులకు అప్పగించాని కకణం కట్టుకున్నాడు. పాపను ఎక్కడకీ కదలకుండా ఉండాలని సూచించాడు. అలానే పక్కన ఉన్న కమ్ములను పట్టుకుని జాగ్రత్తగా పాపను కాపాడి వారి తల్లిదండ్రులకు అందించాడు.

సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యురిటీ ఫోర్స్ కు చెందిన జవాను చేసిన ఆ పనిని అక్కడ ఉన్న వారందరూ మెచ్చుకున్నారు. అంతేగాకుండా కొంతమంది జవాన్ పాపను కాపాడే వీడియోను కవర్ చేశారు. అయితే ఆ విజువల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *