షాకింగ్… మెలితిరిగి ఉన్న కోడిగుడ్డు.. కారణం అదేనా..?

ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో వింతలు ఉన్నాయి. అవి చూస్తే ఎలాంటి వారు అయిన ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అలాంటి ఉన్నాయి. అయితే అన్నీ మన ముందుకు రావు. వచ్చినప్పుడు చూసి ఆశ్చర్య పోయిన చూడాల్సిందే. వాటిని చూస్తే చాలా మంది ఇదేందయ్యా ఇది అని అనుకుంటాం. ఇలాంటి వింతలు ఈ మధ్య కాలంలో చాలా వెలుగులొకి వచ్చాయి. అయితే వాటిలో కొన్నింటిని చూసి అపుడే చెప్పారు కదా బ్రహ్మం గారు అని అంటారు పెద్దలు. మరి కొందరు అయితే కలియుగం ఇలానే ఉంటుందని చెప్తుంటారు. అవన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఓ గుడ్డు వైరల్ అవుతుంది.

VIRAL EGG IN ANDHRAPRADESH
VIRAL EGG IN ANDHRAPRADESH

ఆ కోడి గుడ్డును చూసిన చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. సోషల్ మీడియాలో ఈ అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ గుడ్డు స్పెషల్ ఏంటి అని డవుట్ ఉంది కదా మీకు అది ఏంటో ఇప్పుడు చూద్దాం. సాదారణంగా కోడి పెట్టే గుడ్డు ఎలా ఉంటుంది. గుండ్రంగా.. కొంత సాగినట్లుగా ఉంటుంది. అయితే ఓ కోడి పెట్టిన గుడ్డు వింత ఆకారాన్ని సంతరించుకుంది. ఆ గుడ్డు కురుకురే లెక్కన మెలి తిరిగి ఉంది. చూడటానికి చాలా వింతగా అనిపించడం తో చాలా మంది దాని వారి స్నేహితులకు షేర్ చేస్తున్నారు.

ఇలాంటి గుడ్డును తాము ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. అయితే ఈ కోడి గుడ్డు వింత ఎక్కడో జరిగింది అని అనుకుంటే పొరపాటే.. ఇది మనం తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అయిన.. ఆంధ్రప్రదేశ్‌ లో జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ వింత గుడ్డు వెలుగు చూసింది . ముంజపు సత్యనారాయణ అనే వ్యక్తి ఆ కోడి యజమాని అని స్థానికులు చెప్తున్నారు. మెలితిరిగి ఉన్న ఈ కోడి గుడ్డును చూసి మొదట ఆయన ఆశ్చర్చపోయినట్లు చెప్పారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *