ఆ విధంగా లక్ష్మీదేవి తలుపు తట్టింది… ఏకంగా కోటీశ్వరుడయ్యాడు..!

అదృష్టాన్ని నమ్మే వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది అందరికీ అంత తొందరగా లభించదు కాబట్టి. అందుకే నేను నమ్మను అని ఒక్క మాటలో కొట్టి పారేస్తాం. కానీ మనల్ని వరించి వస్తే ఉంటుంది… ఆ కిక్కే వేరు. ఇలా ఓ వ్యక్తిని అడ్రెస్ తెలుసుకుని మరీ వెంటాడింది అదృష్టం. దీంతో ఆయనకు ఒక్కసారిగా 74 కోట్ల రూపాయిలు ఆఫర్ వచ్చింది. ఇంతకీ ఆయన ఎవరు? ఆ కథ ఏంటి అనుకుంటున్నారా? అయితే స్టోరీలోకి వెళ్లి ఓ లుక్కేయండి మరీ..!

2000 rupees painting turns into 74 cr worth
2000 rupees painting turns into 74 cr worth

క్లిఫోర్డ్ స్కోరర్.. ఇప్పుడు ఈ పేరు జర్మనీ అంతా మారు మోగిపోతుంది. దీనికి కారణం అతని అదృష్టమే. కేవలం 2వేల రూపాయలు పెట్టి కొన్ని ఓ పెయింటిగ్​ ను ఏకంగా 74 కోట్ల రూపాయిలకు అమ్ముడు అయ్యేందుకు సిద్దంగా ఉంది. అయితే స్కోరర్ దగ్గర ఉన్న ఆ పెయింట్ కూ ఆ బంపర్ ఆఫర్ ఊరికే రాలేదు. దానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. వివిధ దేశాలు తిరిగారు. 17కు పైగా విమాన ప్రయాణాలు చేశాడు. ఎంతో మంది ప్రముఖులతో మాట్లాడారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? అతను కొన్న ఆ పెయింటింగ్​ గురించిన మంచి, చెడ్డా తెలుసుకునేందుకు. అలా కష్టపడిన ఆయన శ్రమకు ఫలితం దక్కింది. ఆ ఫలితమే ఇప్పుడు సుమరు 74 కోట్ల రూపాయిను తెచ్చి పెడుతుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే…? క్లిఫోర్డ్ అనే వ్యక్తి ఆర్ట్ గ్యాలరీ కన్సల్టెంట్ గా ఉండే వారు. ఆయనకు మంచి పెయింటింగ్స్ కనిపిస్తే చాలు కొని దాచేస్తుంటారు. ఇలానే ఓ పెయింటిగ్ ను 2019లో మసాచుసెట్స్ ఉన్నప్పుడు ఓ బుక్ స్టోర్​లో కొన్నాడు. అయితే ఆ పెయింటింగ్ ఆయన్ను ఎంతో బాగా ఆకర్షించింది. దీంతో అది నార్మల్ పెయింటింగ్ కాదని ఫిక్స్ అయ్యాడు. దీంతో దేశ విదేశీలు తిరిగి ఆయన దాని గురించి తెలుకుంది ఏంటంటే.? ఆ పెయింటింగ్ వేసింది ప్రముఖ చిత్రకారుడు ఆల్బ్రెచ్ డ్యూరర్. ఇంకేముంది ఒక్క దెబ్బతో దాని విలువ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు దానిని వేలానికి పెడితే ఏకంగా అది 74 కోట్లు పలుకుతుందంట.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *