Viral News: ఆహారం కోసం ఏకంగా కిచెన్ పగలగొట్టి లోపలికి వచ్చిన ఏనుగు… ఏం చేసిందంటే

Viral News: ఏనుగులు అంటే సాధారణంగా ఇష్టపడని వారు ఉండరు. కానీ వాటితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అడవిలో ఉన్నంత కాలం అవి మనుషుల జోలికి రావు. కానీ ఆ అడవుల పరిధి తగ్గిపోతే… ఆహారం కోసం ఎక్కడ వెతుక్కోవాలి అనే సమస్య వాటికి ఎదురవుతుంది. ఆ క్రమంలో అవి చుట్టుపక్కల ఊళ్లలోకి ఎంటరవుతాయి. అరటి తోటలపై పడి నానా బీభత్సం చేస్తాయి. అందుకే ఏనుగుల గుంపు ఊళ్లలోకి వస్తే… స్థానికులు కేరింతలు కొడుతూ వాటిని ఎలాగైనా పంపేయాలని చూస్తారు. అదే విధంగా ఓ ఏనుగు కిచెన్ ని ధ్వంసం చేసింది. ఆకలితో ఉన్న ఆ ఏనుగుకి ఆహారం కోసం ఎక్కడ వెతకాలో అర్థం కాలేదు. ఇంటి కిచెన్ నుంచి వచె వాసనను బట్టి పసిగట్టిన ఆ ఏనుగు ఇంటి కిచెన్ వైపు వచ్చింది. అక్కడ ఓ ఇనుప కిటికీ ఉంది.

elephant entering into house and searching for food

దాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత అందులో తలపెట్టి… కిటికీని మరింతగా వంచేసింది. ఆ తర్వాత సగం తలను కిటికీ నుంచి కిచెన్‌లోకి పెట్టి తొండంతో అంతా వెతికింది. అక్కడి అరలు, కప్‌బోర్డ్ అన్నీ చెక్ చేసింది. ఇలా ఏనుగు కిచెన్ కిటికీ ధ్వంసం చెయ్యడం, తల లోపలికి దూర్చడంతో… ఆ ఇంట్లో వాళ్లు హడలిపోయారు. పక్క గదిలోకి వెళ్లి ఏనుగును వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేస్తున్నంతసేపూ వాళ్లు వణుకుతూనే ఉన్నారు. కాసేపు అలా వెతికిన ఏనుగు… ఏమీ లేవు అనుకుంటూ వెళ్లిపోయింది. మళ్లీ వెంటనే తల దూర్చి… కప్ బోర్డ్ డోర్‌ని మూసేసి వెళ్లిపోయింది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా సక్లేష్‌పురంలోని అల్లూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *