బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ ” శ్రీ లీల “… ఏకంగా ప్రభాస్‌తోనే !

పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు యంగ్ బ్యూటీ ” శ్రీ లీల “. తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది ఈ భామ. గత ఏడాది ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం కాలేదు. కానీ ఈ సినిమాతో హీరోయిన్ శ్రీలీలకి తెలుగులో మంచి పేరు వచ్చింది. శ్రీలీల అంతకు ముందు కన్నడలో ఓ సినిమా చేసిన… పెళ్లి సందD తర్వాత ఈ యంగ్ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

sreeleela next project with rebal star prabhas

శ్రీలీల ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో ‘ధ‌మాకా’లో నటిస్తుండగా.. వాలంటైన్స్ డే సందర్భంగా శ్రీలీల పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ధమాకా యూనిట్. దీంతో పాటుగా న‌వీన్ పొలిశెట్టి ‘అన‌గ‌న‌గా ఒక‌రాజు’ సినిమాలో కూడా న‌టిస్తున్న శ్రీలీలకు తాజాగా మరో భారీ బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ పక్కన హీరోయిన్ ఛాన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఆ గోల్డెన్ ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకి దక్కిందాని సమాచారం.

sreeleela next project with rebal star prabhas

ప్రభాస్ త్వరలోనే మారుతీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నదని వార్తలు వస్తున్నాయి. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని టాక్ వినిపిస్తుంది. ఆ ముగ్గురిలో శ్రీలీల కూడా ఒక హీరోయిన్ గా చర్చలు జరుగుతున్నాయట. అదే నిజమైతే శ్రీలీలకి బంపర్ ఆఫర్ దక్కినట్లే అని అందరూ అంటున్నారు. ప్రబాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఆయన మరో సినిమా రాధే శ్యామ్ రిలీజ్ కానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *