స‌మంత సినిమాకు భారీ సెట్‌.. ఖర్చు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. ముఖ్యంగా చై తో విడాకుల తర్వాత స్పీడ్‌ మరింత పెంచింది. ఇక సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం యశోద.  మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

samantha yashoda movie unit  huge cost erected for set

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. య‌శోద సినిమా కోసం మేక‌ర్స్ భారీ ఖ‌ర్చుతో సెట్స్ ను రెడీ చేశారు. ఈ సినిమా కోసం కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో రూ. 3 కోట్ల రూపాయల ఖర్చుతో సెట్స్ వేశారు. ప్రస్తుతం ఆ భారీ సెట్స్‌లో కథలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ విలాసవంతమైన సెవెన్ స్టార్ హోటల్ సెట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ముందుగా ఓ హోటల్‌లో ఈ షూటింగ్ నిర్వహించాలనుకున్నామని.. కానీ 35, 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత ఈజీ కాదని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ వెల్లడించారు. అందుకే సీనియర్ కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో సెట్స్ రూపొందించామని.. నాన‌క్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పుకొచ్చారు నిర్మాత. డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ… సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశామని.. ఫిబ్రవరి 3న మొదలైన షెడ్యూల్ అక్కడే జరుగుతోందని చెప్పుకొచ్చారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *