తన ఫస్ట్‌ శాలరీ గురించి చెప్పిన సమంత.. టాటూస్ వేయించుకోవద్దంటూ సూచన..!

దక్షిణాది అందాల భామ సమంత వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. ఇప్పుడు సామ్ బాలీవుడ్‌, హాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తన మకాంను ముంబైకి మార్చే పనిలో సమంత ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో సమంత ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను సామ్ నెటిజన్లతో పంచుకుంటూ పోస్టులు పెడుతుంటుంది.

Samantha reveals her first salary

ఇక నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం ‘కాతువాక్కుల రెండు కాదల్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సమంత ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తాను చూసిన ఫస్ట్ మూవీ ‘జురాసిక్ పార్క్’ అని సమంత తెలిపింది. ఓ హోటల్‌లో తాను హోస్టెస్‌గా పని చేశానని… ఎనిమిది గంటలు పని చేసి రూ. 500 అందుకున్నానని… అదే తన తొలి సంపాదన అని సమంత చెప్పింది.

Samantha reveals her first salary

ప్రతి రోజూ సంతోషంగా ఉండాలని, ఉన్నంత కాలం ఉన్నతంగా బతకడమే తన కలని తెలిపింది. టాటూస్‌ గురించి అడగ్గా, తాను టీనేజ్‌లో ఉన్న సమయంలో ఎప్పటికీ టాటూలు వేసుకోకూడదని అనుకున్నాననని, వాటి జోలికి అస్సలు పోవద్దని సూచించింది. ఇక సామ్‌ తన శరీరంపై మూడు టాటూలు వేసుకున్న సంగతి తెలిసిందే. ‘మహిళలకు మీరిచ్చే సందేశం’ ఏంటి అని మరో అభిమాని అడగ్గా, ‘మిమ్మల్ని మీరు నమ్మండి. దేనికీ భయపడొద్దు. ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్‌ అవ్వొద్దు. మీ కలలను సాకారం చేసుకోండి’ అని సమాధానం ఇచ్చింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *