మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చినా కూడా మిస్ చేసుకున్న నదియా.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఈయన సినిమాల్లో నటించాలని ఎంతోమంది నటీనటులు ఎదురుచూస్తుంటారు.

చిన్న పాత్రయినా సరే ఈయన సినిమాలో నటించడానికి ఎవరు వెనుకాడరు. ఎందుకంటే ఆయన క్రేజ్ అలా ఉంటుంది కాబట్టి. అలా ఓసారి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చినా కూడా నటి నదియా ఆ అవకాశాన్ని వదులుకుంది. తాను కోరుకోకున్నా తనకు చిరంజీవి సినిమాలు అవకాశం వచ్చినా కూడా తాను వదులుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఒకప్పుడు నదియా హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈమెకు చిరంజీవి సరసన నటించే అవకాశం వచ్చింది.1990 లో కే మురళి మోహన్ రావు దర్శకత్వంలో కొదమసింహం అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి నటించగా ఆయన సరసన రాధ, వాణి విశ్వనాథ్, సోనం నటించారు. నిజానికి సోనం ప్లేస్ లో ముందుగా నదియాకు అవకాశం వచ్చింది.

కానీ తనకు డేట్స్ చిరంజీవి డేట్ లకు కుదరకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకుంది. అలా అప్పట్లో చిరంజీవి సరసన అవకాశాన్ని మిస్ చేసుకుంది నదియా. ఇక ప్రస్తుతం రీ ఎంట్రీ తో మంచి మంచి పాత్రల్లో చేస్తూ ప్రేక్షకులను మరోసారి మెప్పిస్తుంది. ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *