సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన గౌరవం.. భావోద్వేగంతో ట్వీట్‌ చేసిన మహేశ్‌బాబు

ఇవాళ సూపర్ స్టార్‌ కృష్ణ పుట్టినరోజు. మంగళవారంతో(మే 31న) ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తనయుడు, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కోడలు ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. అలాగే సీని ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు ఆయన బర్త్‌డే నేపథ్యంలో కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వరించింది. ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Super star krishna birthday celebrations

కుమార్తెలు, అల్లుళ్లు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య సూపర్ స్టార్ కృష్ణ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం కృష్ణకు అలవాటు. ఈ ఏడాది ఆయన అదే విధంగా చేశారు. కుటుంబ సభ్యుల నడుమ కృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేశారు. కృష్ణ సతీమణి ఇందిరా, ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు, వీకే నరేష్, సుధీర్ బాబు, మంజుల తదితరులతో పాటు మిగతా కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్లు సందడి చేశారు. కొంత మంది అభిమానులు సైతం కృష్ణను కలిశారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిన్న అల్లుడు సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ సినిమా గ్లింప్స్‌ విడుదల చేశారు.

సోషల్‌మీడియా వేదికగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు మహేశ్‌బాబు. ఆయన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. మీలాగా ఎవ్వరూ ఉండరంటూ పోస్ట్‌ పెట్టారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. నిజంగా మీలాగా ఎవ్వరూ ఉండరు. మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్‌ యూ..’ అంటూ అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *