అబ్బాయిగా మారిన తమన్నా.. వైరల్‌ అవుతున్న వీడియో

హ్యాపీడేస్ సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ట్యాగ్‌ను సొంతం చేసుకుంది తమన్నా. దాదాపు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్‌లోనూ తమన్నా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఇటీవల తమన్నా జోరు కాస్త తాగిందనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత తమన్నా కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో తెలుగులో గుర్తుందా శ్రీతకాలం సినిమా ఉంది. ఈ సినిమా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఎఫ్ 3 సినిమాతో సక్సెస్ అందుకుంది.

Tamannaah new insta reel goes viral on the internet

తాజాగా ఈ మిల్కీ బ్యూటీ అబ్బాయిగా మారింది. గుమ్మం..తలుపులు ముందు చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది. అదే గుమ్మం దాటి..తలుపులు మూస్తే అబ్బాయిగా మారిపోతుంది. ఇన్స్టారీల్స్ లో భాగంగా అమ్మడు ఇలాంటి వీడియో ఒకటి చేసి నెట్టింట అభిమానులకు షేర్ చేసింది. అమ్మడు నాచు కలర్ చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ క్షణమే మళ్లీ అబ్బాయిగా ప్యాంట్..టీషర్ట్..మీసాలు..హెయిర్ స్టైల్‌తో అచ్చంగా అబ్బాయిలా మారిపోతుంది.

దానికి సంబంధించిన వీడియో ఒకటిప్పుడు నెటింట వైరల్‌గా మారింది. ఇలాంటి సరదా వీడియోలు తమన్నాకి కొత్తేంకాదు. గతంలో ఇలాంటి అల్లరి వీడియోలు చేసి బోలెడంత పాపులారిటీ కొట్టేసింది. వాటికి ఇన్ స్టాలో లో మంచి లైక్స్..షేర్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నంతో ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక తమన్నా అటు వరుస సినిమాలు, ఇటు వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *