నేను ఎప్పుడు అలాంటి పనులు చేయను అంటూ సమంత గురించి పరోక్షంగా మాట్లాడిన చైతూ..!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందినటువంటి అక్కినేని నాగ చైతన్య సమంత గురించి అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని వీడిపోనున్నారు. విడాకుల ప్రకటన తర్వాత సమంత తన విడాకుల గురించి పలుమార్లు స్పందిస్తూ.. ఇకపై తన జీవితంలో తాను నిలబడాలని ఏ విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదనీ వెల్లడించారు.ఇక ఈ విషయం గురించి నాగచైతన్య ఒక్క మాట కూడా మీడియాకు వెల్లడించకుండా మీడియాకు దూరంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యకు యాంకర్ నుంచి పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ క్రమంలోనే నాగచైతన్య ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నాగచైతన్యను ప్రశ్న అడుగుతూ మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు? అని ప్రశ్నించగా..అందుకు నాగ చైతన్య సమాధానం చెబుతూ నేను అన్ని పాత్రలలో నటిస్తున్నాను అయితే ఏ పాత్ర అయినా నా ఫ్యామిలీకి ఇబ్బంది పెడుతుందని భావిస్తే అలాంటి పాత్రలు చేయడానికి నేను ఒప్పుకోనని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే కొందరు నాగచైతన్య సమంతను ఉద్దేశించి ఈ మాటలు అన్నారా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. నాగ చైతన్యకి ఇష్టం లేకున్నప్పటికీ సమంత సినిమాలలో నటించడమేకాకుండా ఎన్నో బోల్డ్ పాత్రలో కనిపించడం వల్ల ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి విడాకుల వరకు దారి తీసిందని సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఏదిఏమైనా ఎంతో అందమైన ఈ జంట విడిపోవడం అభిమానులకు బాధాకరంగానే ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *