నిధి పాప సీక్రెట్‌గా పెళ్లి చేసుకోనుందా?

సినిమా ఇండ‌స్ట్రీ ప్రస్తుతం సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి, విడాకుల వార్తలతో నిండిపోయింది. కొన్ని జంట‌లు పెళ్లి చేసుకుంటుండ‌గా.. కొంద‌రు మాత్రం విడిపోతున్నారు. ఇక కొందరు పెళ్లి కాక‌పోయినా.. రిలేష‌న్‌షిప్‌లో అయితే ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా న‌టి నిధి అగ‌ర్వాల్‌, త‌మిళ న‌టుడు శింబుల మ‌ధ్య కూడా ఇలాంటి రిలేష‌న్ షిప్ ఉంద‌ని రూమర్స్‌ వ‌స్తున్నాయి. ఇక‌ వీరు త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి ప్రేమాయాణం గురించి గతంలో కూడా పలుమార్లు వార్తలొచ్చాయి.

Hero simbu and Nidhi Agarwal to get married soon

తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్‌ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని తెలుస్తుంది. అంతేకాదు పెళ్లి కోసం గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని ఫిల్మనగర్‌లో టాక్‌ వినిపిస్తోంది.

Hero simbu and Nidhi Agarwal to get married soon

కాగా ఈశ్వరన్‌ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నిధి ఆ సినిమా సమయంలోనే శింబుతో ప్రేమలో పడిపోయిందట. ఆ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్లిందని, ఇప్పటికే నిధి పాప టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్లు కోలీవుడ్‌ టాక్‌. మరి నిధి-శింబుల పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్స్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపిన శింబు ఈసారి అయినా పెళ్లికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తాడా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తోంది నిధి. ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆమె, ఇది పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తోందట.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *