డ్యాన్స్‌తో అదరగొట్టిన చిరు-చరణ్.. ‘భలే భలే బంజారా’ సాంగ్ చూశారా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ దర్శకుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 29కి వాయిదా వేశారు.

bhale bhale banjara full song out from mega star chiranjeevis acharya movie

ఇక చిరంజీవి- రామ్‌చరణ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వీలిద్దరూ పక్కపక్కనిలబడితేనే అభిమానులకు పండగలా ఉంటుంది. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేస్తే? ఆ మజా ఏ రేంజ్‌లో ఉంటుందో తాజాగా విడుదలైన ‘భలే భలే బంజారా.. సిరుత పులుల సిందాట’ గీతం చూపించింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమాలో ‘భలే భలే బంజారా’ అనే సాంగ్ ను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నామని తెలిపారు. కాసేపటి క్రితమే ఈ పూర్తి పాటను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. పోటా పోటీగా స్టెప్పులు వేస్తూ తండ్రీ, కొడుకులిద్దరూ దుమ్ముదులిపేశారు.

ఈ పాటలో శేఖర్‌ మాస్టర్‌ తీర్చిదిద్దిన కూల్‌ స్టెప్పులు, కామ్రేడ్‌ లుక్కులు వావ్‌ అనిపించేలా ఉన్నాయి. చిరు-చరణ్ కాంబో అదిరిపోయింది. ఇక పాట రిలీజ్ అయినప్పటి నుంచి దీనికి సంబంధించిన స్టెప్పులు, ఫోటోలతో.. పోస్టులు, మీమ్స్‌ వేస్తూ సోషల్‌ మీడియాలో హడావిడి చేస్తున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ కి జోడీగా పూజా కనిపించనున్నారు.

https://twitter.com/KChiruTweets/status/1516017233654259712?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1516017233654259712%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fbhale-bhale-banjara-full-song-out-from-acharya-movie-30068

Add a Comment

Your email address will not be published. Required fields are marked *