యాక్సిడెంట్ కు గురైన కచ్చా బాదం సింగర్..

Kacha Badham Singer: ప్రస్తుతం కచ్చా బాదం పాట సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే చాలామంది ఈ పాటకు రీల్స్ కూడా చేస్తున్నారు. చాలామంది పాపులర్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అందులో విఫలం అవుతూ ఉంటారు. ఇంకొంతమంది చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయి పోతూ ఉంటారు ఈ వరుసలోనే భూటాన్ బద్యాకర్ ఉన్నారు. పల్లీల అమ్ముకునే ఈ వ్యాపారి సంపాదన రోజుకి 200 లేదా 300 రూపాయలు కానీ ఒక పాట ఈ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఈ ఒక పాటతో సెలబ్రిటీ అయిపోయాడు.

ఈ పాట పాడటం వల్ల వచ్చిన రెమ్యూనరేషన్ తో సెకండ్ హ్యాండ్ లో ఒక కారును కొన్నారు అయితే కారు డ్రైవింగ్ రాని భూటాన్ కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉండగా ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో భూటాన్ కు ఛాతి మీద బలమైన గాయం అయింది దాంతో విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు వైద్యుల సమాచారం ప్రకారం భూటాన్ పరిస్థితి ఇప్పుడు బాగుందని తెలిపారు.

భూటాన్ పాడిన ఈ కచ్చా బాదం పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది ఈ పాటకు దాదాపు 50 మిలియన్ వ్యూస్ కి పైగా నే వచ్చాయి ఈ పాటకు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యి రీల్స్ చేస్తు వారి ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈయన సొంత ఊరు
పశ్చిమ బెంగాల్‌ లోని లక్ష్మీనారాయణపూర్‌ కురల్జురీ గ్రామం. భూటాన్ కు ముగ్గురు పిల్లలున్నారు.ఈ ఒక పాటతో పేరు తెచ్చుకున్న భూబన్‌ని ఈమధ్యే బెంగాల్ పోలీసులు సత్కరించారు. భూటాన్ పాడిన ఈ పాట వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఈ ఒక్క సాంగ్ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేసింది.

ఈ పాట బాదామ్ బాదామ్ కచ్చా బాదామ్ అంటూ సాగుతుంది ఈ పాటతో భూబన్ తన పల్లీలు ను ప్రజలు కొనుక్కునేలా చేస్తుంటాడు. ఆ పాట విన్న ప్రజలు భూటాన్ పాటకు ఫిదా అయ్యి ఆనందంతో పల్లీలు కొంటారు. అదే పాట సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఈ పాటని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *