మహేశ్‌బాబుతో రొమాన్స్‌ చేయనున్న బాలీవుడ్‌ హీరోయిన్‌?

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా.. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ‘ఆర్​ఆర్​ఆర్’ తర్వాత తన సినిమా మహేశ్​తోనే ఉంటుందని రాజమౌళి ఎప్పుడో ప్రకటించారు. తెలుగుతో పాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కుతుందని ఇటీవల మహేశ్​ సైతం ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Alia bhatt to act with mahesh babu's pan india movieఅడవి నేపథ్యంలో సాగే యాక్షన్‌ సినిమా అనే ఊహాగానాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మహేశ్‌బాబు సరసన బాలీవుడ్‌ నటి అలియా భట్‌ సందడి చేయనుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని కథానాయిక పాత్రకు అలియానే న్యాయం చేయగలదని భావించిందట చిత్ర బృందం. ఈ మేరకు ఆమెను సంప్రదించిందని తెలుస్తోంది. మహేశ్‌ బాబుతో కలిసి నటించేందుకు అలియా సుముఖంగా ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సిఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఉండే ఈ పాన్‌ ఇండియా సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు.

Alia bhatt to act with mahesh babu's pan india movie

ప్రస్తుతం మహేశ్‌ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 12న ప్రేక్షకులకు ముందుకు రానున్నది. ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా కీర్తి సురేష్‌ నటించింది. అలాగే మహేశ్ బాబు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం సైతం చేయనున్నారు. ఇక రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయికలుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అలియా ఓ కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *