మెగా ఫ్యామిలీ VS మంచు ఫ్యామిలీ .. మళ్లీ కోల్డ్‌ వార్‌ స్టార్ట్‌?

మంచు ఫ్యామిలీ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మంచు మోహ‌న్‌బాబు, విష్ణు కలిసి ఇటీవలే వారి పర్సనల్‌ హెయిర్ డ్రెస్సర్‌పై తమ విలువైన మేకప్ సామాన్లు దొంగలించారంటూ పోలీసు కేసు పెట్టారు. అయితే ఆ హెయిర్ డ్రెస్సర్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. త‌న‌ను, త‌న కుల వృత్తిని విష్ణు అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించాడ‌ని, అందుకే జాబ్ లోంచి మానేస్తే తిరిగి త‌నపైనే త‌ప్పుడు కేసు పెట్టాడంటూ వాపోయాడు. దీంతో శ్రీనుపై తప్పుడు కేసు పెట్టి అతడిని ఇరికించారని మంచు ఫ్యామిలీని నెటిజన్స్ తెగ ట్రోల్‌ చేస్తున్నారు. మరోపక్క నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు మోహన్ బాబు, విష్ణు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

naga babu helps hair dresser naga sreenu  it may effects on manchu family?

ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ నోరుమెదిపింది లేదు. దీంతో ఈ వివాదం చల్లారిపోతుంది అనుకొనేలోపు మెగా బ్రదర్ నాగబాబు అగ్గిరాజేశారు. మా ఎలక్షన్స్ అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు నాగబాబు బాహాటంగానే మోహన్ బాబు క్యారెక్టర్ ఇది అంటూ ఆరోపణలు చేశారు. ఇక తాజాగా మోహన్ బాబు తిట్టి, కేసుపెట్టిన హెయిర్ డ్రస్సర్ నాగ శ్రీనుకు.. నాగబాబు చేయూతనిచ్చారు.

నాగ శ్రీనును  పిలిచి ధైర్యం చెప్పి రూ. యాభై వేల సాయం చేశారు నాగబాబు. అతని తల్లి వైద్యానికి.. పిల్లలకు వైద్య పరీక్షలు చేయిస్తానని హామీ ఇచ్చారు . దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మంచు ఫ్యామిలీ పోలీసు కేసు పెట్టిన వ్యక్తికి నాగబాబు దగ్గరికి తీసుకొని ఎందుకు సహాయం చేశారో వాళ్ళకే తెలియాలి. ఈ సంఘటనతో మరోసారి ఈ రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుందని అంతా అనుకుంటున్నారు. దీనిపై మంచు ఫ్యామిలీ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి మరి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *