మహేష్ బాబు అభిమానులకు బిగ్గెస్ట్ గుడ్ న్యూస్!

Mahesh Babu: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలుసు. ఈ హీరో ని ఎక్కువగా ఇష్టపడే అమ్మాయిలు మిల్క్ బాయ్ అని పిలుచుకుంటారు.

Mahesh Babu
Mahesh Babu

ఇక మహేష్ టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు అభిమానులు గుడ్ న్యూస్ గా భావించే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. అదేమిటంటే.. మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించి ప్రేక్షకులను మెప్పించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను రీమేక్ చేస్తున్నారు అనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

అప్పట్లో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కెరీర్ ను ఈ సినిమా మార్చేసింది. దాంతో.. నేటి తరం ప్రేక్షకులకు అల్లూరి సీతారామరాజు ను మరోసారి దగ్గర చేయాలనే ఆలోచన లో మహేష్ బాబు ఉన్నాడని తెలుస్తుంది. మరి ఈ పుకార్లు నిజమో.. కాదో తెలియాలి అంటే మహేష్ బాబు అధికారికంగా ఈ సినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరి ఈ పుకార్లు నిజమైతే.. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పిస్తాడో లేదో చూడాలి. ఇక మహేష్.. పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *