ఆ క్రికెటర్‌, తెలుగు హీరోయిన్ మధ్య ఏం జరుగుతోంది?

సాధారణంగా క్రికెటర్స్, హీరోయిన్స్ మధ్య ప్రత్యేక బంధం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. విరాట్-అనుష్క, హార్దిక్‌ పాండ్య-నటాషా, హర్భజన్‌ సింగ్‌- గీతా బస్రా, యువరాజ్‌ సింగ్‌- హాజెల్, కేఎల్ రాహుల్- అతియా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జంటలే ఉన్నాయి. ప్రేమ, రూమర్స్‌ విషయంలో అయితే ఇంకా చాలా జంటలే ఉన్నాయి. వీరిలో తాజాగా మరో జంట చేరింది. భారత క్రికెటర్ ఒకరు టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమాయణానికి సిద్ధమయ్యారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మన తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌, KKR ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ప్రేమలో ఉన్నారా అంటూ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో డిస్కషన్ అవుతుంది. అసలు ఏమైంది అంటే…

are cricketer venkatesh iyer and actress priyanka jawalkar in relation

ఉగాది రోజున ప్రియాంకా జవాల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. దాని కింద వెంకటేష్ అయ్యర్ కామెంట్ చేశారు. ‘క్యూట్’ అంటూ ప్రియాంక అందాన్ని మెచ్చుకున్నారు. అతడి కాంప్లిమెంట్ చూసిన ప్రియాంకా జవాల్కర్ స్పందించారు. ‘ఎవరు? నువ్వా?’ అని సరదాగా స్పందించారు. దాంతో సోషల్ మీడియాలో చర్చ షురూ అయ్యింది.

are cricketer venkatesh iyer and actress priyanka jawalkar in relation

ప్రియాంకా జవాల్కర్ మీద వెంకటేష్ అయ్యర్ మనసు పారేసుకున్నారని, ఇద్దరి మధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌ జరుగుతోందని కొంత మంది కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ తరహాలో పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు, క్రికెటర్లు ఉన్నారు. దాంతో చర్చ ఎక్కడికో వెళ్ళింది. అయితే… గతంలోనూ వెంకటేష్ అయ్యర్ ఫోటోలకు ప్రియాంకా జవాల్కర్, ఆమె ఫోటోలకు అతడు కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని టాలీవుడ్ టాక్. అయితే… వెంకటేష్ అయ్యర్ కామెంట్ చేసిన తర్వాత సేమ్ డ్ర‌స్‌లో దిగిన ఫొటోలను ప్రియాంకా జవాల్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంకటేష్ అయ్యర్ కోసమే ఈ ఫొటోలు పోస్ట్ చేస్తున్నావా? అని నెటిజన్స్ కామెంట్స్ చేయడం గమనార్హం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *