బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న అనుష్క.. నెట్టింట ఫోటోలు వైరల్..!

బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ తన నటనతోనే కాదు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.  2008లో వచ్చిన ‘రబ్ నే బనాది జోడీ’ సినిమాతో సినీ ప్రేక్షకులకు అనుష్క పరిచయం అయ్యారు. ఆ సినిమా భారీ హిట్ కొట్టడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కెరీర్ మంచి ఊపులో ఉండగానే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుష్క శర్మ. వివాహం అనంతరం అనుష్క సినిమాలు చేయడం తగ్గించేశారు. పూర్తి సమయం కోహ్లీతోనే గడిపారు. కోహ్లీ, అనుష్క జంటకు వామికా అనే చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌తో అరకొర సినిమాలు చేస్తుంది అనుష్క.

Anushka Sharma shares gorgeous beach photos with Virat Kohli

నెట్ ఫ్లిక్స్ షో ‘చక్ దా ఎక్స్ ప్రెస్’ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న అనుష్క భర్త విరాట్ కోహ్లీతో మాల్దీవుల పర్యటనకు వెళ్లింది. అక్కడ స్విమ్ సూట్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది. ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ పై తనను తానే ఫొటోలు తీసుకుని వాటిని ఇన్‌స్టా‍గ్రామ్‌లో పోస్ట్ చేసింది. మీ ఫొటోలను మీరే తీసుకుంటే.. వచ్చే రిసల్ట్ ఇది’ అని అనుష్క క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లయినా తగ్గేదేలే, అనుష్క చాలా డేంజ‌ర్ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ‘మై : ఏ మదర్స్ రేంజ్’, ‘చక్దా ఎక్స్ ప్రెస్’, ‘ఖాలా’ చిత్రాలకుక ప్రొడ్యూసర్‌గా పనిచేస్తోంది అనుష్క. నెట్ ఫ్లిక్స్ కోసం చిత్రీకరించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’లో ఝులన్ గోస్వామి పాత్రను పోషించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. చిత్రాల్లో నటించడమే కాకుండా.. ఇటు నిర్మాతగాను వ్యవహరించింది అనుష్క శర్మ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *