‘గాంధారి’గా అదరగొట్టిన కీర్తి.. రేపే విడుదల

‘మహానటి’తో స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌..ఈ మధ్య వరుస ప్లాప్‌లను చవిచూస్తుంది. ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. సోలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ చేసిన ప్రతీ సినిమా బోల్తా కొడుతూనే వస్తుంది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఇలా ప్రతీ సినిమా మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. కీర్తి సురేష్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా ఏ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేదు.

keerthi suresh as gandhari in music album

ఈ ప్రభావం కీర్తి ప్రస్తుతం చేస్తున్న చిత్రాలపై కూడా పడుతుంది. ప్రస్తుతం కీర్తి మహేశ్‌బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. కీర్తి నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతుండటంతో మహేశ్‌ మూవీ ఫలితం ఎలా ఉంటుందో అని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజా కీర్తి తన కొత్త మ్యూజిక్ వీడియో ‘గాంధారి’తో అభిమానులను ఆనందపరచడానికి సిద్ధంగా ఉంది. సౌత్ టాప్ కొరియోగ్రఫర్ బృందా మాస్టర్ డైరెక్షన్‌లో ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించారు. దీ రూట్‌, సోనీ మ్యూజిక్‌ సౌత్‌ సంస్థలు కలిసి గాంధారి అనే మ్యూజిక్ ఆల్బమ్‌ని నిర్మించాయి.  లవ్ స్టోరీ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్ ఈ మ్యూజిక్ వీడియోకు సంగీతం సమకూర్చారు. ఇందులో ‘గాంధారి’ టైటిల్ క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నాట్యమాడింది. ఈ ‘గాంధారి’ ఆల్బమ్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘గాంధారి’ మ్యూజిక్‌ ఆల్బమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. చేతికి గోరింటాకుతో చిరునవ్వులు చిందిస్తోన్న కీర్తి సురేష్ పోస్టర్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *