కేన్స్ 2022: రెడ్ కార్పెట్ పై దుస్తులు విప్పేసిన ఉక్రెయిన్ మహిళ

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఫిల్మ్ ఫెస్టివల్‌ వేదికగా రెడ్ కార్పెట్‌పై ఉక్రెయిన్‌కు చెందిన మహిళ వినూత్న నిరసన తెలిపింది. తమ దేశమైన ఉక్రెయిన్‌లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేస్తూ అర్ధనగ్న స్థితిలో నినాదాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Cannes 2022: Woman Goes Topless to Protest Against Sexual Violence in Ukraine

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నటీమణులు వాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ చెందిన సెలబ్రిటి ఒక్కసారిగా రెడ్‌ కార్పెట్‌పైకి వెళుతూ.. ఒక్కసారిగా తన దుస్తులను విప్పి నినాదాలు చేసింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్‌ జెండా రంగులను వేసుకొని.. తమపై జరిగే అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెపై దుస్తులు కప్పి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. దీనిపై కేన్స్ అధికారిక బృందం ఇంకా ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆ దేశానికి చెందిన సినిమాలనూ ప్రదర్శిస్తున్నారు.

కాగా దాదాపు రెండు నెలలకు పైగా రష్యా.. ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్‌పై తీవ్రంగా దాడులు చేస్తుంది. ఈ యుద్ధంలో వేలాది మంది చనిపోగా.. వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక  కేన్స్ వేడుకల్లో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వీడియో కాన్ఫరెన్స్‌లో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల్లో తమ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే.. సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అంటూ ప్రశ్నించారు. దీంతోపాటు రష్యా సేనలు తమ పౌరులపై దారుణాలకు దిగుతున్నాయని.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రపంచం దీనిపై స్పందించాలని జెలెన్‌స్కీ కోరారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *