విజయ్ దేవరకొండతో సమంత లిప్‌లాక్..?

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, స్టార్‌ హీరోయిన్‌ సమంత జంటంగా కలిసి నటిస్తున్న లవ్‌ స్టోరీ ‘ఖుషి’. ప్రేమ కథా చిత్రాలకు మారుపేరైన శివ నిర్వాణ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌-సమంత కలిసి నటిస్తున్నారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ఎంతో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంటెన్స్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్‌-సామ్‌ మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్‌ చేయడంతోనే డైరెక్టర్‌ శివ నిర్వాణ ఈ సీన్స్‌ క్రియేట్‌ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Samantha, Vijay Deverakonda have lip lock scenes in Kushi?

అయితే ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం మాజీ భ‌ర్త‌ నాగ చైతన్యతో మాత్రమే లిప్ లాక్ చేసిన సామ్.. మ‌రి శివ నిర్వాణ డిమాండ్‌ను అంగీక‌రించి ఒకే చెప్తే షాక‌వ్వాల్సిన విష‌య‌మే అంటున్నారు సినీ జ‌నాలు. ఒక‌వేళ సామ్ లిప్ లాక్ సీన్‌లో క‌నిపిస్తే మాత్రం తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కొత్త ట్రెండ్‌కు తెర‌లేపిన‌ట్టేనంటున్నారు సినీ విశ్లేష‌కులు. అయితే సమంత సిల్వ‌ర్ స్క్రీన్‌పై లిప్ లాక్ సీన్ చేసేందుకు రెడీగా లేద‌ని మ‌రో టాక్ కూడా న‌డుస్తోండ‌గా..మ‌రి ఈ క్రేజీ అప్‌డేట్‌పై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఇక ఈ సినిమా చిత్రీకరణ కోసం గత కొన్నిరోజులుగా కశ్మీర్‌లోనే ఉంటోన్న సామ్‌.. ఆ ప్రాంతంలోని ప్రకృతి అందాలకు మనసుపారేసుకున్నారు. కశ్మీరీవాసుల జీవనశైలిని తెలియజేసేలా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ‘‘కశ్మీర్‌.. ఇక, నిన్ను ఎప్పుడు తలచుకున్నా నా పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది’’ అని రాసుకొచ్చింది.

కాగా  కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఈ ఖుషి. ఇందులో సామ్‌ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా, విజయ్‌ స్టైలిష్‌ అబ్బాయిగా కనిపించనున్నట్లు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ తెర‌కెక్కిస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *