లగ్జరీ కారు కొన్న రాజమౌళి.. ఫీచర్లు అదిరిపోయాయ్..!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి హిట్టు మీద హిట్టుతో దూసుకుపోతున్నారు. ఒక్కో సినిమా కోసం మూడు, నాలుగేళ్లు కష్టపడే ఈ డైరెక్టర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తీసుకొచ్చింది ఈ సినిమా. ‘ఆర్ఆర్ఆర్’తో దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు రాజమౌళి.

Director SS Rajamouli Brings Home The Volvo XC40 SUV

తాజాగా రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. తన గ్యారేజ్‌లోకి ఖరీదైన వోల్వో ఎక్స్‌సి40 కారును తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్‌ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్‌ చేసింది.  ఫోటోలని పోస్ట్ చేసి..”మేము వోల్వో కార్ ఇండియా కుటుంబానికి ఫిల్మ్ డైరెక్టర్ మరియు స్క్రీన్ రైటర్ రాజమౌళిని సవినయంగా స్వాగతిస్తున్నాము. అతని దార్శనికతలతో సమానంగా అతనికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాలు జరగాలని మేము కోరుకుంటున్నాము” అంటూ పోస్ట్ చేశారు. రెడ్ కలర్‌లో ఉన్న ఈ వోల్వో కారు ధర దాదాపు 45 లక్షలు ఉంటుందని సమాచారం.

2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో కారుకు పవర్ నిచ్చారు. ఈ ఇంజిన్‌తో 187 బీహెచ్ పీ వద్ద 300 నానోమీటర్ల టార్క్ను జనరేట్ చేస్తుంది. 8 గేర్లుండడం విశేషం. డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉండడం మరో విశేషం. రాడార్ ఆధారిత సిటీ సేఫ్టీ, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, స్టీరింగ్ అసిస్ట్, వాహనాల మధ్య దూరాన్ని ఇండికేట్ చేసే అలర్ట్ వంటి అదిరిపోయే ఫీచర్లున్నాయి. కాగా, ఎక్స్ సీ 40లోనే ఎలక్ట్రిక్ వెర్షన్ నూ వోల్వో తీసుకొస్తోంది. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఆయన మహేష్ బాబు హీరోగా సినిమాను మొదలుపెట్టనున్నారు. జేమ్స్ బాండ్ తరహాలో సినిమా ఉంటుందని సమాచారం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *