ఆ సింగర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్!

Allu Arjun: టాలీవుడ్ ప్రేక్షకులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన స్టైల్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను ఫిదా చేసుకుంటూ వచ్చాడు బన్నీ. ఇక బన్నీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో వెలుగుతున్నాడు.

ఇక పుష్ప మూవీలో కథ ఒక ఎత్తు అయితే ఆ సినిమాలో పాటలు మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ‘శ్రీవల్లి’ పాటకు ప్రాణం పోసినందుకు గాను సిద్ది శ్రీరామ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో శ్రీ రామ్ పై ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన విషయాన్ని మెన్షన్ చేసాడు.

“విశ్రాంతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని ఎదురు చూశాను. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా సోదరుడు శ్రీరామ్ స్టేజ్ పై అందరి ముందు శ్రీవల్లి పాట పాడుతున్నపుడు ఇలా అనిపించింది. అతడు ఆ పాట పాడడం స్టార్ట్ చేసిన తర్వాత మ్యూజిషియన్స్ ఎలా సౌండ్ ను కుడా ప్లే చేయకుండా చూస్తూ అలాగే ఉండిపోయారు.

 

కానీ శ్రీరామ్ మాత్రం పాడడం ఆపలేదు. మ్యూజిక్ లేకుండానే పాట పాడుతూ అందరిని ఆకట్టుకున్నాడు. ఆయన పాట ఎంతో అద్భుతంగా సాగింది. ఆ సమయంలో నాకు ఏమని అనిపించిందంటే ఆయనకు మ్యూజిక్ అవసరం లేదు. ఎందుకంటే ఆయనే ఒక మ్యూజిక్ కాబట్టి” అని బన్నీ సిద్ది శ్రీరామ్ ను పొగిడాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *