అదరగొట్టిన వరుణ్ తేజ్.. మూవీ ట్రైలర్‌ చూశారా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గని. డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో వరుణ్ ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా గని ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

varun tej ghani movie trailer out

బాక్సింగ్‌ ఆడనని తన అమ్మకు మాటిచ్చిన ఓ యువకుడు.. బాక్సర్‌గా ఎలా మారాడు? నేషనల్‌ ఛాంపియన్‌ కావాలనే అతని కల నెరవేరిందా? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘‘ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది’’, ‘‘లైఫ్‌లో మంచోడ్ని కెలుకు, చెడ్డోడ్ని కెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనే పిచ్చోడ్ని మాత్రం కెలక్కు’’ అంటూ ట్రైలర్‌ చివర్లో వరుణ్‌ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతిబాబు, నదియా, సునీల్‌దత్‌ కీలకపాత్రలు పోషించారు. సిక్స్ ప్యాక్ లుక్‏లో వరుణ్ అదిరగొట్టాడు. ప్రొఫెషనల్ బాక్సర్ అయ్యేందుకు గని ఎంతగా కష్టపడ్డాడో చూడొచ్చు.. మొత్తానికి తాజాగా విడుదలైన ట్రైలర్‏కు సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉందో చూడాలంటే ఏప్రిల్ 8వరకు వేచిచూడాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *