పోలీస్‌ గెటప్‌లో అదిరిపోయిన రామ్.. పవర్‌ఫుల్‌ టీజర్ చూశారా..!

యంగ్‌ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారియర్. తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. రామ్ మొదటి సారి పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. పవర్ ఫుల్ విలన్ పాత్రలో విలక్షణ నటుడు ఆదిపినిశెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , బుల్లెట్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. ఆకట్టుకున్నాయి.

Ram The Warriorr Movie Teaser Out

తాజాగా ఈసినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఈ పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నామప్పా’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఈ సినిమాలో రామ్.. సత్య అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చూసి ఉంటారు.. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా? అంటూ రామ్ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. విలన్ ఆది రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఓవరాల్‌గా టీజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.

మరోవైపు తాజాగా ఈ చిత్రం  హిందీ వెర్షన్‌కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *