తన రిలేషన్షిప్ గురించి అసలు నిజం బయట పెట్టిన నాని హీరోయిన్!

Rukshar Dhillon: నాచురల్ స్టార్ హీరో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో అనుపమ, రుక్సార్ దిల్లాన్ లు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా రుక్సార్ దిల్లాన్ కూడా ఈ సినిమాతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

Rukshar Dhillon
Rukshar Dhillon

తొలిసారిగా కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా రుక్సార్ ఆ తర్వాత ఆకతాయి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ సినిమా తర్వాతే కృష్ణార్జున యుద్ధం, ఏబిసిడి వంటి పలు సినిమాలలో నటించింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా తన రిలేషన్ షిప్ గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. ప్రస్తుతం హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా 30 ఏళ్ళు వచ్చిన ఓ వడ్డీ వ్యాపారి.. తన పెళ్లి కోసం పడే పాట్ల నేపథ్యంలో రూపొందుతుంది.

ఇక ఈ సందర్భంగా రుక్సార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు కాబోయే వాడి గురించి కొన్ని విషయాలు తెలిపింది. తాను గతంలో రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపింది. ఇక తనకు కాబోయేవాడు నిజాయితీగా, నిబద్ధతతో ఉండాలని.. తనతో జీవితాంతం గడిపే వ్యక్తిగా ఉండాలని తెలిపింది. ఆ వ్యక్తి గురించి ముందుగానే పూర్తిగా తెలుసుకోవాలన్న కోరిక తనకు ఉందని తెలిపింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *