మహాశివరాత్రి స్పెషల్.. అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేసిన స్టార్‌ హీరోస్ !

పండుగ సందర్భాల్లో.. త్వరలో విడుదల కాబోయే చిత్రాలు హంగామా చేస్తుంటాయి. ఒక్కో అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్‌ నింపుతుంటాయి. నేడు మహాశివరాత్రి సందర్భంగా.. స్టార్‌ హీరోలు వరుసగా తమ తదుపరి చిత్రాల విశేషాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. వాటిలో కొన్నింటిని చూద్దాం రండి.

మహాశివరాత్రి సందర్భంగా తన అభిమానులకు తీపి కబురు అందించారు ప్రభాస్‌. ఆయన తదుపరి చిత్రం ‘ఆదిపురుష్‌’ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. ‘‘ 2023 జనవరి 12న ‘ఆదిపురుష్‌’ 3డీలో విడుదల కానున్నట్లు ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ నటి కృతిసనన్‌ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా కనిపిస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం గతంలోనే పూర్తి చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల దగ్గరే ఆలస్యమవుతోందని సమాచారం.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాశివరాత్రి సందర్భంగా కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేసి మహేశ్‌ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందుతోంది.

Star hero's movie updates on Mahashivarathri

మోస్ట్ ఎవెయిటెడ్ టాలీవుడ్ బిగ్ ప్రాజెక్టుల్లో RRR ఒక‌టి. ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. RRR షూటింగ్‌ సమయంలో కెమెరా రోల్‌ అవ్వకుండా ఉంటే.. తారక్‌- చెర్రీలు ఇదిగో.. ఇలా ప్రశాంతంగా ఫోన్లతో గడుపుతుంటారని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ మంగళవారం ట్వీట్‌ చేసింది. ‘‘కెమెరా రోలింగ్ కానప్పుడు స్క్రోలింగ్’’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Star hero's movie updates on Mahashivarathri

Add a Comment

Your email address will not be published. Required fields are marked *