‘ఆర్ఆర్ఆర్’ మరో రికార్డ్.. రూ.1,000 కోట్లు దాటిన వసూళ్లు

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజే ఈ సినిమా రెండొందల కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా ఓ తాజా రికార్డును నమోదు చేసింది.

RRR box office collections

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లు వసూలు చేసుకుంది. సినిమా విడుదలైన 16 రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. ఇంతకుముందు రూ.1,000 కోట్లు వసూలు చేసిన చిత్రాలు భారత సినీ చరిత్రలో రెండే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లు చేసిన తొలి భారతీయ సినిమాగా ‘దంగల్‌’, రెండో చిత్రంగా ‘బాహుబలి 2’ ఉన్నాయి. ఇప్పుడా జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేరడంతో చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. వెయ్యి కోట్లు అనేది ఒక ఇండియన్ సినిమాకి డ్రీమ్ అని.. మీకోసం బెస్ట్ సినిమా రూపొందించామని.. దీనికి బదులుగా సినిమాపై ఎనలేని ప్రేమ చూపించారని పోస్ట్‌లో రాసుకొచ్చింది.

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలియాభట్‌, ఒలివియా మోరిస్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా సినిమాకి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *