వేశ్యను పెళ్లి చేసుకుంటా అంటున్న హీరో నాని!

Nani: కలకత్తా నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో హీరో నాని, సాయి పల్లవి, కృతి శెట్టి లు మెయిన్ రోల్స్ చేశారు. ఇక ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 24న థియేటర్లో విడుదలై ప్రేక్షకుల ను ఓ రేంజ్ లో ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ జెండా ఎగురా వేసింది.

ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ లోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక మొన్నటివరకు థియేటర్ లలో బాగా హడావిడి చేసిన ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ కొనుగోలు చేసి మొన్న అనగా జనవరి 21న నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో కూడా బాగానే హడావిడి చేస్తుంది.

ఇదిలా ఉంటే శనివారం రోజు ‘శ్యామ్ సింగరాయ్’ డిలీటెడ్ సీన్ ను ఈ చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. ఆ సీన్ లో నాని వేశ్యల దగ్గరికి వెళతాడు. అక్కడ వేశ్యల ముందు వారి వృత్తి గురించి  నాని పొగుడుకుంటూ రాసిన లైన్స్ వారికి వివరిస్తాడు.

అలా వివరించగా అందులో ఒక వేశ్య ఇంత తెలిసిన వాడివి మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే దానికి నాని నవ్వుకుంటూ ‘కచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు’ అని సమాధానం ఇస్తాడు. ప్రస్తుతం ఈ డిలేటెడ్ సీన్ యూట్యూబ్ లో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *