నాలుగైదేళ్లు మీ మొహం చూపించకండి అన్నాడు తారక్: జగపతిబాబు షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు మాస్ హీరోయిజం తో మరోవైపు కమర్షియల్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. ఇక తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. ఆపై త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’ మూవీలో తన హీరోయిజం వేరే స్థాయిలో కనపరిచాడు.
ఇక అదే సినిమాలో తనలోని ఓ ప్రత్యేక రౌడీయిజం ఉందని మరోసారి ప్రూఫ్ చేసిన సీనియర్ నటుడు జగపతిబాబు. ఎన్నో సినిమాలలో ఫ్యామిలీ హీరోగా నటించిన ఆయన కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇదిలా ఉండగా జగపతి బాబు ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘అరవింద సమేత’ సినిమా గురించి, అందులో చేసిన బసిరెడ్డి పాత్ర గురించి, ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. నిజానికి అరవింద సమేత వీర రాఘవ స్క్రిప్ట్ అద్భుతంగా కుదిరింది. ఇందులో హీరో ఎంత కూల్ గా కనిపిస్తాడో.. విలన్ అంత ఎగ్రెసివ్ గా కనిపిస్తాడు.
తన పాత్రతో పాటు విలన్ పాత్ర కూడా నచ్చి అర్థం చేసుకొని ఎన్టీఆర్ సినిమా చేయడానికి ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. అలా ఒప్పుకొని తారక్ నాకు కావాల్సిన పనిష్మెంట్ ఇచ్చేశాడు. రోజూ కాల్ చేసేవాడు. నీ క్యారెక్టర్ చాలా బాగుంది అనే వాడు. సినిమా ఫంక్షన్ నేపధ్యంలో నా గురించి మాట్లాడుతూ.. సినిమా చూసిన వారికి ముందు బసిరెడ్డి గుర్తుంటాడు.
ఆ తర్వాతే నేను గుర్తుంటా అని అన్నాడు. తను అలా అనడం పెద్ద స్టేట్మెంట్. మీరు తారక్ తో ఆడుకుంటున్నారు. అది కుదరదు మీతో ఇక చేయలేను నాలుగైదు ఏళ్లు నీ మొహం చూపించకండి అన్నాడు తారక్. దానికి నేను ఓకే తారక్ అన్నాను’ అని తెలిపాడు జగపతిబాబు.