ఆసక్తి రేకెత్తిస్తున్న సమంత మూవీ ఫస్ట్ గ్లింప్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగైదు సినిమాలను లైన్‌లో పెట్టింది. ముందుగా ‘యశోద’ అనే సినిమాను పూర్తి చేయబోతుంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది.
samanthas first glimpse from yashoda
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ‘యశోద’ సినిమా రూపుదిద్దుకొంది. కాగా, తాజాగా ఈసినిమా నుంచి సమంత రోల్‌ని అందరికీ పరిచయం చేస్తూ ‘యశోద’ ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్రబృందం షేర్‌ చేసింది. ఇందులో సామ్.. ఏదో ప్రమాదంలో ఉన్నట్లు చూపించారు. మరి సమంతకు ఎదురైన ప్రమాదం? దాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది? ఇలాంటి ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరకనుంది. హ‌రి – హ‌రీష్ ద‌ర్శ‌కులుగా శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘‘సమంతకు ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ సీజన్ 2 ఎంత పేరు తెచ్చిందో మనకు తెలుసు. ఆమె రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంకా బెట‌ర్‌గా ఉండేలా య‌శోద సినిమాను రూపొందించాం. ఈ సినిమాలో స‌మంత త‌న పాత్ర‌ను క్యారీ చేసిన తీరు చూస్తే చాలా గ‌ర్వంగా అనిపించింది. ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. జూన్ మొద‌టి వారానికంతా ‘యశోద’ షూటింగ్ పూర్తవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.
https://www.instagram.com/p/CdKjOa4AJn7/

Add a Comment

Your email address will not be published. Required fields are marked *