రికార్డు క్రియేట్ చేసిన మహేశ్ పాట.. మేకింగ్ వీడియో చూశారా!
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. ఫిబ్రవరి 13న ఈ సినిమా నుంచి కళావతి సాంగ్ రిలీజైంది. ఈ ‘కళావతి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు దూకినాయా.. ఏందే నీ మాయ.. అంటూ సాగే లిరిక్స్ సంగీతప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటివరు ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 29 మిలియన్ల వ్యూస్ రాగా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. సెన్సేషనల్‌గా మారిన ఈ హిట్ పాటకు తమన్ సంగీతం అందించగా సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు.
emunnadra babu 🔥🔥🔥🤩🤩
making of kalavathi
full song lo mass emo 🤘🤙#Kalaavathi#SarkaruVaariPaata @urstrulyMahesh
pic.twitter.com/JOReuckBfx— Sociopath (@J_114j) February 17, 2022
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో మహేష్ మరింత్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్.. సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిత్రయూనిట్ మహేశ్, కీర్తి సురేశ్ ఫన్నీ మూమెంట్స్‌ను చూపించారు. ఈ వీడియోలో వీరిద్దరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మహేష్, డైరెక్టర్ పరశురామ్ ఫన్నీగా గడిపినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇక మహేశ్ అభిమానులు ఈ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ మాత్రమే కాదు.. సంగీత దర్శకుడు తమన్, గాయకుడు సిద్ శ్రీరామ్, ఇతర వాద్యాకారులతో కూడా కలర్‌ఫుల్‌గా పాటను చిత్రీకరించారు. ఈ పాటలో కనీసం 2 నిమిషాలు వీరంతా కనిపించి ఉంటారు. దీని కోసం సుమారు రూ.60 లక్షలు ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తోంద. అయితే, వారి కష్టం ఏదీ వృథా కాలేదు. కానీ, యూట్యూబ్‌లో రిలీజ్ కంటే ముందే ఈ పాట బయటకు లీకైపోయింది. వేరే దారి లేకపోవడంతో ఈ పాటను చెప్పిన రోజు కంటే ముందే విడుదల చేయాల్సి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.