క‌శ్మీర్‌లో సమంతకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

వరుస పాన్‌ఇండియా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఆమె నటించిన ‘శకుంతలం’ మూవీ త్వరలోనే విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చిట్టి భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా ‘యశోద’ సినిమాలోనూ సమంత నటిస్తోంది. శుక్రవారం విడుదలైన ‘కణ్మని రాంబో ఖతీజా’ సినిమాకు మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

కాగా నిన్న (గురువారం) సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అనేకమంది ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే సమంతకు ఓ హీరో నుంచి మాత్రం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ లభించింది. ఆ హీరోనే విజయ్‌ దేవరకొండ. శివ‌నిర్వాణ  డైరెక్ష‌న్‌లో చేస్తున్న సినిమా కోసం ప్ర‌స్తుతం క‌శ్మీర్ లొకేష‌న్‌లో ఉంది సామ్‌, విజ‌య్ టీం. అయితే గురువారం పుట్టిన‌రోజుజ‌రుపుకోబోతున్న సమంత కోసం శివ‌నిర్వాణ‌తో ఫేక్ స‌న్నివేశం రాయించాడు విజ‌య్‌. వేకువజామునే 12 గంట‌ల‌కు సామ్‌కు విషెస్ తెలిపేందుకు సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేశారు టీం మెంబ‌ర్స్ అంతా.

సమంత ఆ సీన్‌ను నిజమనుకుని నమ్మేసింది. క్యాంప్ ఫైర్ వద్ద విజయ్‌తో సీన్‌లో లీనమైంది. పాత్రలో ఒదిగిపోయి డైలాగులు చెప్పడం మొదలుపెట్టింది. అనంతరం విజయ్ దేవరకొండ తన డైలాగ్ చెబుతూ.. ‘‘సమంత’’ అనేశాడు. దీంతో అతడు పొరపాటున సమంతా అన్నాడు కాబోలని నవ్వేసింది సామ్. ఆ వెంటనే విజయ్ ఆమెకు ‘హ్యాపీ బర్త్ డే’ సమంతా అని చెప్పాడు. చిత్రయూనిట్ కూడా పెద్ద కేక్ సమంత ముందు పెట్టి విషెస్ చెప్పారు. సమంత ఒకింత ఆశ్చర్యంతో ఇదంతా చూస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *