బాలీవుడ్‌ స్టార్‌ హీరోతో కలిసి డ్యాన్స్‌ చేసిన కేంద్ర మంత్రి..!

దుబాయ్‌లో జరుగుతున్న ఇండియా ఎక్స్‌పోలో ఓ ఆస‌క్తికర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ వేదిక‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో కలిసి స్టెప్ వేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా దుబాయ్ లో నిర్వ‌హించిన ఇండియ‌న్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం యూఏఈకి చేరుకుంది.

union minister anurag thakur dances with bollywood actor ranveer singh

ఇందులో భాగంగా.. భారతీయ మీడియా, వినోద రంగానికి సంబంధించి రణ్‌వీర్‌ సింగ్‌ ప్రాతినిథ్యం వహించాడు.  దీంతో రణ్‌వీర్‌ అతిధిగా వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ని ఓ స్టెప్ వేయమని అడిగాడు. బాలీవుడ్ పాపులర్ సాంగ్ మల్హరి అనే సాంగ్‌కి రణవీర్ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో మంత్రి కూడా రణ్‌వీర్‌తో కలిసి స్టేజిపై స్టెప్పులు వేశారు. హీరోతో కలిసి అనురాగ్‌ ఠాకూర్ చేసిన డ్యాన్స్ వీడియోని తన టీం అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ..”పవర్ అఫ్ బాలీవుడ్ అన్ని అడ్డంకుల్ని అధిగమిస్తుంది. మంత్రి అనురాగ్ ఠాకూర్ హీరో రణ్‌వీర్‌సింగ్ తో కలిసి డ్యాన్స్ చేశారు”అంటూ పోస్ట్ చేశారు. హీరోతో సెంట్రల్ మినిష్టర్ దుబాయిలో స్టెప్ వేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దుబాయ్‌ ఎక్స్‌పోలోని ఇండియన్‌ పెవిలియన్‌ను చూసేందుకు దాదాపు 17 లక్షల మంది తరలివచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. భారత ఎగ్జిబిషన్‌లో యోగా, ఆయుర్వేదం, టూరిజం, టెక్స్‌టైల్, కాస్మిక్ వరల్డ్, సినిమా ప్రపంచంతో సహా భారతీయ ప్రదర్శనలను చూడటానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని మంత్రి ఠాకూర్ చెప్పారు. ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ వినోద, చలనచిత్ర రంగాలకు చెందిన పలువురితో వరుస చర్చలు జరిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *