భార్యను చంపి.. చేతులు దులుపుకుందాం అనుకున్నాడు..  చివరకు ఆత్మ చేతిలో బుక్కయ్యాడు!

ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. పైగా ఇతర సమస్యల వల్ల చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబసభ్యులంతా కలిసి ఆమెను ఖననం చేశారు. కేసు కూడా క్లోజ్ చేశారు. కానీ అనూహ్యంగా ఆత్మ ఎంట్రీతో కేసు రీఓపెన్ చేశారు. అప్పటిదాకా తనకు సంబంధం లేదుంటూ తప్పించుకున్న ఆ భర్త… ఆత్మ చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. ఎలాగంటే?

the-ghost-who-helped-solve-her-own-murder
the ghost who helped solve her own murder

అమెరికా వెస్ట్ వర్జినీయాకు చెందిన ఎల్వా జోనా హీస్టెర్ షుయ్ మహిళ 1897లో మృతి చెందింది. పెళ్లయిన మూడు నెలలకే ఆమె అనుమానాస్పదంగా భర్త ఇంట్లో చనిపోయింది. అయితే ప్రెగ్నెన్సీ సమస్యల కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయిందని భర్త చెప్పారు.  కాగా ఒకనాడు తన కూతురు ఆత్మ తనతో మాట్లాడిందని… ఎల్వా జోనా తల్లి మేరీ తెలిపారు. ప్రెగ్నెన్సీ కారణాలతో తాను చనిపోలేదని.. ఆమె భర్త ఎరాస్మస్ చంపేశాడని చెప్పిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై ఓ లాయర్ ను సంప్రదించారు. కేసును రీఓపెన్ చేయించారు.

అప్పుడు ఎల్వా  మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. 1897 జనవరి 23న ఎల్వా చనిపోతే.. ఫిబ్రవరి 22న శవపరీక్ష నిర్వహించారు. మూడు గంటల పాటు నిర్వహించిన పోస్టుమార్టంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆమె మెడ విరిచేసి, గొంతుపై తొక్కి హత్య చేసినట్లుగా రిపోర్టులో తేలింది. ఎల్వాను హత్యచేశారనే రిపోర్టులు వచ్చిన తర్వాత… ఆమె భర్త ఎరాస్మస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా విచారణలో ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆయనకు ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగిందని… మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా… రెండో భార్య చనిపోయిందని చెప్పారు. ఈ కేసులో ఎరాస్మస్ కు జీవిత కాల జైలు శిక్ష విధించారు. కాగా ఆత్మ హంతకుడిని పట్టించిందని పోలీసులు ఆమె శిలాఫలకం ఏర్పాటు చేశారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *