ఓవర్ నైట్ సెన్సెషన్ గా మారిన టెక్ యూట్యూబర్​.. ఎలా అంటే?

అదృష్టం ఎవరికి ఎలా కలిసి వస్తుందనేది ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారి వచ్చింది అంటే మనకు ఎక్కడో సుడి ఉండే ఉండాలి. అలాంటి సుడే అమెరికన్ యూట్యూబర్ కు ఉంది. అందుకే రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. కాసుల వర్షం అతని మీద కుప్పలుగా కురిసింది. దీంతో ఏకంగా క్షణాల వ్యవధిలోనే రూ. 1.75 కోట్ల సంపాదించాడు. అది కూడా కేవలం 42 సెకన్ల వ్యవధిలో కావడం విశేషం. ఇతకీ అతను ఏం చేశాడు అని అనుకుంటున్నారా?

TECH YOUTUBER EARNS RS 1 DOT 75 CRORE IN 45 SECONDS FOR NFT TECHNOLOGY
TECH YOUTUBER EARNS RS 1 DOT 75 CRORE IN 45 SECONDS FOR NFT TECHNOLOGY

అసలు ఏం జరిగిందంటే.. ఈ మధ్య కాలంలో క్రిప్టో కరెన్సీ అనేది బాగా ఫేమస్ అయ్యిది. ఒక్కొక్కరికీ కోట్లు తెచ్చి పెడుతోంది. అంతేకాకుండా కొంతమందిని బికారీని కూడా చేస్తోంది. అయితే ఇలాంటి డిజిటల్ కరెన్సీనే ఎన్​ఎఫ్​టీ. దీనిని మరో విధంగా నాన్ ఫంగబుల్ టోకెన్ అని కూడా అంటారు. జోనాథన్​ మా అనే ఈ టెక్ యూట్యూబర్ ఇటీవల వ్యాక్సీడ్​ డాగ్ గోస్ అనే పేరుతో ఎన్​ఎఫ్​టీ ని విడుదల చేసాడు. అయితే ఈ మొత్తం కేవలం కొన్ని క్షణాలలోనే 1.75 కోట్లను తెచ్చి పెట్టింది. దీనిని ఎక్కువ మంది కొనడం వల్ల కేవలం 42 సెకెన్లలోనే ఈ మొత్తం వచ్చి అతని అకౌంట్​లో పడింది. దీంతో మా క్షణాల్లోనే కోటీశ్వరుడు అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియోలో మనోడు న్యూస్ వైరల్ గా మారింది.

జోనాథన్​ మా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటాడు. ఈయన కు జోమా టెక్ అనే యూట్యూబ్​ ఛానెల్ కూడా ఉంది. గతంలో ఫేస్ బుక్, గూగుల్ లాంటి టెక్ సంస్థల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేశాడు. ఈయన యూట్యూబ్ ఛానెల్ కు ప్రస్తుతం 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఛానెల్ లో ముఖ్యంగా క్రిప్టో పై, కంప్యూటర్ టెక్నాలజీ పై, ఇతర కొత్త సాంకేతికతలపై వీడియోలు చేస్తుంటాడు. అయితే మా కు వచ్చిన సొమ్ముతో ఫిల్మ్ ప్రోడ్యూసర్ అవుతాను అని అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *