బ్రేకప్ చెప్పుకున్న మరో స్టార్‌ కపుల్?

గత కొద్ది కాలంగా బాలీవుడ్‌లో ఒకపక్క వరుసగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటుంటే మరోవైపు కొంతమంది లవ్ బర్డ్స్ బ్రేకప్‌లు చెప్పుకుంటున్నారు. ఇటీవల లైగర్‌ బ్యూటీ అనన్య పాండే తన ప్రియుడు ఇషాన్‌ ఖట్టర్‌తో విడిపోయింది. తాజాగా మరో బాలీవుడ్ జంట బ్రేకప్ చెప్పుకుంది అని బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Star couple Sidharth Malhotra-Kiara Advani part ways?

‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హిందీలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. ‘షేర్హా’ షూట్‌ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. ఈ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్లు అభిమానులను ఆకట్టుకొన్నాయి. ఆ సమయంలో వారిద్దరూ ప్రమోషనల్ కార్యక్రమాల్లో చేసిన హంగామా మీడియా పత్రికలను సైతం ఆకర్షించాయి. ఇక వీరు త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అందరూ చెప్పుకొన్నారు. తరచూ వీరు డిన్నర్‌ డేట్స్‌, హాలీడే కోసం విదేశాలకు వెళ్లి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో మీ పెళ్లి ఎప్పుడంటూ.. సోషల్‌మీడియాలో అభిమానులు అడుగుతున్నారు.

Star couple Sidharth Malhotra-Kiara Advani part ways?

కానీ సడెన్‌గా ఏం జరిగిందో తెలియదు.. వీరు తమ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు షాక్‌ అవుతున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ మేరకు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు వార్తాకథనాలు కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. మరి ఇందులో ఏమాత్రం నిజముందో తెలియాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *