నా కంటే 12 ఏళ్లు చిన్నోడు.. డేటింగ్‌ చేస్తే తప్పేంటి: స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బి-టౌన్‌లో టాక్‌ కూడా వినిపిస్తోంది. అర్జున్‌ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. దీంతో వీరిద్దరి రిలేషన్‌ విషయంలో తరచూ ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది ఈ జంట. అయినా ఆ రూమార్లను ఏమాత్రం పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటుపోతున్నారు. అలాగే వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి వారి రిలేషన్‌, ఏజ్‌ రిఫరెన్స్‌పై ప్రశ్నలు ఎదురువుతూనే ఉన్నాయి.

Malaika Arora Slams People Trolling Her For Dating Arjun Kapoor Calls It Misogynist

వీటిపై తాజాగా మలైకా స్పందించారు. ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన రిలేషన్‌ గురించి ప్రస్తావించారు. ‘‘ఒక మహిళ వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో రిలేషన్‌లో ఉంటే ఈ సమాజం ఎందుకు తప్పుగా చూస్తోంది. అందులో అస్సలు తప్పేముంది? బ్రేకప్‌, లేదా విడాకుల తర్వాత ఒక మహిళ.. తనకంటూ ఓ జీవితాన్ని క్రియేట్‌ చేసుకోవాలి. స్వశక్తితో ముందడుగు వేయాలి. ధైర్యంగా ఎలా జీవించాలో మా అమ్మ నుంచి ప్రేరణ పొందాను. ‘నీకిష్టం వచ్చినట్లు నువ్వు జీవించు. ఎవరిపై ఆధారపడకు. నీకు ఏం చేయాలనిపిస్తే అది మనస్ఫూర్తిగా చేశాయ్‌’ అని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ మాటల్నే నేను ఎక్కువగా నమ్ముతుంటాను’’ అని మలైకా తెలిపారు.

Malaika Arora Slams People Trolling Her For Dating Arjun Kapoor Calls It Misogynist

అయితే ముందుగా మలైకా.. బాలీవుడ్ హీరో, సల్మా్న్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరు 18 ఏళ్లు కలిసున్నారు. అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటినుండి యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉంది మలైకా.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *