RRR: ‘ఎత్తర జెండా’ ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం​ బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. 11 వందల​కు పైగా వసూళ్లను సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి పెంచింది. ఈ మూవీ విడుదలై నెల దాటింది. ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి ఈ మూవీలోని ఫుల్‌ సాంగ్స్‌ను ఒక్కొక్కొటిగా విడుదల చేస్తూ వస్తోంది చిత్ర యూనిట్‌.

RRR movie ethara jenda full song out now

ఇప్పటికే ‘నాటు నాటు’, ‘కొమ్మా ఉయ్యాలా’, ‘దోస్తీ’ వీడియోలు పంచుకున్న టీమ్‌ తాజాగా సెలబ్రేషన్‌ ఆంథమ్‌ ‘ఎత్తర జెండా’ను అందించింది.  ‘నెత్తురు మరిగితే ఎత్తరా జెండా’ అంటూ సాగే ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాటను విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంతి, హారిక నారాయణ్ కలిసి పాడారు. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల డాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎండ్ టైటిల్స్‌లో ఈ సాంగ్ వస్తుంది. సినిమా విడుదలకు ముందే ఈ పాటకు సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేసినా అందులో కథానాయకులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, కథానాయిక అలియా భట్ మాత్రమే కనిపించారు. ఈ కొత్త వీడియోలో దర్శకుడు రాజమౌళి, అజయ్‌దేవ్‌గణ్‌, ఒలివియా మోరిస్‌ తళుక్కున మెరిశారు. ఇక చివరిలో ఎన్టీఆర్‌, చరణ్‌, అలియాలతో కలిసి జక్కన్న కూడా స్టెప్పులు వేయడం ఈ పాట విశేషం.

నిర్మాత దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *