పవన్ కళ్యాణ్‌ వారసుడి సినీఎంట్రీపై రేణు క్లారిటీ.. ఏమందంటే..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వారందరిలో ఎక్కువగా అందరి ఫోకస్ పవన్ కళ్యాణ్ వారసుడిపైనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత అకీరానందన్ తప్పకుండా ఇండస్ట్రీలోకి వస్తాడు అని అభిమానులు అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక అకీరా నేడు(ఏప్రిల్‌ 8న) 18వ వడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడి తల్లి, నటి రేణు దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది.

Renu desai shares Akhira nandhans video on his birthday

ఇందులో అకిరా నందన్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. తన ప‌వ‌ర్‌ఫుల్‌ పంచ్ లతో ఆశ్చర్యపరిచాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని భావించారు. మీడియాలో కూడా వార్తలొచ్చాయి. దీంతో రేణుదేశాయ్ తన కొడుకు డెబ్యూ ఫిలింపై క్లారిటీ ఇచ్చింది. అకిరాకు హీరో అవ్వాలని లేదని.. ఇప్పటివరకు ఏ సినిమా సైన్ చేయలేదని.. దయచేసి అలాంటి రూమర్స్ నమ్మొద్దంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అకిరా తన తండ్రి లెగసీను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కాకపోయినా.. ఎప్పటికైనా అకిరా సినిమాల్లోకి వస్తాడని ఆశిస్తున్నారు.

Renu desai shares Akhira nandhans video on his birthday

రేణుదేశాయ్ ఇప్పటికే చాలా సార్లు తన కొడుక్కి హీరో అవ్వాలని లేదంటూ చెప్పుకొచ్చింది. అకిరాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని.. ఆ దిశగా అడుగులు వేస్తాడేమో అని కూడా చెప్పింది. ఇక అకీరా మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గానే ఉంటున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ నుంచి విడాకులు తీసుకున్న అప్పటికి కూడా తండ్రిగా అయితే తన పిల్లలకు దగ్గరగానే ఉంటున్నాడు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా ఖాళీ సమయాల్లో కొడుకు కూతురు తండ్రితో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *