భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలంటే శుక్రవారం సాయంత్రం భర్త భార్యకు ఇది ఇవ్వాల్సిందే!

సాధారణంగా శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అని భావించి ప్రత్యేకంగా పూజలు చేస్తాము. శుక్రవారం కేవలం అమ్మవారికి మాత్రమే కాకుండా శుక్రుడికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు.వీరి అనుగ్రహం మనపై ఉండాలంటే శుక్రవారం ప్రత్యేక పూజలతో కొన్ని నియమనిష్టలతో పూజ చేయడం వల్ల మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది. మరి శుక్రవారం అమ్మవారికి ఏ విధమైనటువంటి నియమాలు పాటించి పూజ చేయాలి అనే విషయానికి వస్తే…

సాధారణంగా శుక్రవారం పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజు రాత్రి మనం పడుకునే సమయంలో ఇంట్లో లైట్స్ అన్ని ఆర్పివేసి పడుకుంటాము. కానీ శుక్రవారం ఈశాన్యంలో మాత్రం లైట్ వెలిగేలా చూసుకోవాలి. లేదా ఒక దీపాన్ని అయినా ఈశాన్య దిశలో వెలిగిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇలా చేయటంవల్ల అమ్మవారి కరుణాకటాక్షలకు పాత్రులు అవుతాము.అదేవిధంగా మన జీవితంలో ఒడిదుడుకులు ఎదురౌతాయి శుక్రవారం సాయంత్రం పంచముఖి దీపాన్ని వెలిగించాలి.

ఇలా ఎన్నో నియమాలను పాటిస్తున్న కొందరికి ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి అలాంటి వారు శుక్రవారం అమ్మవారికి కర్పూరహారతి ఇచ్చి ఆ బూడిదను పర్సులో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.మరి కొందరు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడంతో ఎంతో బాధపడుతుంటారు ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు శుక్రవారం సాయంత్రం భర్త భార్యకు ఏదైనా బహుమతి ఇవ్వడం వల్ల వారి మధ్య మంచి అన్యోన్యత ఏర్పడుతుందని చెప్పవచ్చు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *