ఆ వ్యక్తిని కాటేసిన కోబ్రా.. వైరల్ వీడియో!

Cobra: ఈ మధ్యకాలంలో పాములను పట్టే స్పెషలిస్ట్స్ తరచూ రకరకాల పాములు పట్టుకుని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. వాళ్ళు ఆ పామును పట్టుకునే క్రమంలో పాముకి ఏ మాత్రం భయపడకుండా నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కి వెళ్లి బయట పడ్డాడు. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందాం.

cobra
cobra

ఆ వ్యక్తి పేరు వవా నరేష్. అతడు కేరళ లో నివాసం ఉంటాడు. పాములను కాపాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఇప్పటి వరకు 50 వేలకు పైగా పాములను రక్షించాడు. గత 20 సంవత్సరాలుగా పాములను పట్టి వాటిని సురక్షితమైన ప్రాంతాలకు చేరుస్తాడు. ఇదే క్రమంలో ఆ వ్యక్తి కొట్టాయంలో ఒక పెద్ద నాగుపాము పట్టుకోవడానికి వెళ్ళాడు.

తనకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండడంచేత అతను ఆ పామును పట్టుకోవడానికి ఎలాంటి ఎక్యుప్ మెంట్స్ తీసుకెళ్లలేదు. ఇక మెల్లగా పామును తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. దాన్ని పట్టుకొని సంచిలోకి పంపించబోయాడు. కానీ ఆ పాము రివర్స్ అయ్యింది ఆ వ్యక్తి మోకాలుకు కాటు వేసింది. అది చూసిన చుట్టుపక్కల వారు ఎంతో భయపడ్డారు.

దాంతో ఆ వ్యక్తికి చాలా అపాయం అనిపించింది. ఇక ఆ వ్యక్తి ఆ పామును తన కంట్రోల్ లోకి తీసుకొని సంచిలోకి విడిచిన తర్వాతే ఆ వ్యక్తి హాస్పిటల్ లో వైద్యసేవలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *