Nellore Box Office Report (నెల్లూరు బాక్స్ ఆఫీస్) November 2nd Week

నెల్లూరు బాక్స్ ఆఫీస్ పోయిన వారం లాగానే ఈ వారం కూడా నిరాశాజనకంగా కొనసాగుతున్నది. పాత నోట్ల రద్దు ప్రభావం కొంతమేరకు సినిమాలపై కూడా పడింది. అయినా నగరంలో సూపర్ హిట్ అంటూ చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమీ లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా ఆలస్యం అవుతూ విడుదల అయిన నాగచైతన్య, మంజిమా మెహన్ లు జంటగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం ఎస్ 2 సినిమాస్ మరియు అర్చన థియేటర్ లలో విడుదల అవగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కరువయ్యాయి. ఆసక్తికరమైన కథనమే అయినా సెకండాఫ్ సోదిగా సాగుతూ ఉండడం వలన ఈ చిత్రానికి సరైన పబ్లిక్ టాక్ రాలేదు. గతవారం విడుదల అయిన ‘నరుడా డోనరుడా’ భారీ ప్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం ఈ చిత్రం లీలామహల్ థియేటర్ లో ఒక్క ఆటే ఆడుతున్నది. అలానే నర్తకి థియేటర్ లో ఆడుతున్న కళ్యాణ్ రామ్ ‘ఇజం’ కలెక్షన్లు లేక వెలవెలబోతున్నది. ఎస్ 2 సినిమాస్ లో ఆడుతున్న నాగచైతన్య ‘ప్రేమమ్’, కార్తీ ‘కాష్మోరా’, హిందీ చిత్రం ‘రాక్ ఆన్ 2’, ఆంగ్ల చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్’, లీలామహల్ లో విడుదల అయిన జీవా, హన్సికల తమిళ డబ్బింగ్ చిత్రం ‘పోకిరి రాజా’ నూతన చిత్రాలు విడుదల లేక కొనసాగుతున్నాయి. ఇక సిరి ముల్టీప్లెక్ లో ఆడుతున్న హిందీ చిత్రం ‘ఇష్క్ జనూన్’, మలయాళ డబ్బింగ్ చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’ ను పట్టించునే వారే లేరు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *