చిరంజీవితో గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన సుమన్!

Suman: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ సుమన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనకు గాను ప్రేక్షకుల, విమర్శలకు ప్రశంసలు అందుకున్నాడు. ఇక అప్పటి స్టార్ హీరోలలో తాను ఒక్కడుగా ఓ వెలుగు వెలిగాడు.

Suman
Suman

ఇక తెలుగు ఇండస్ట్రీతో పాటు మొదట్లో తమిళ ప్రేక్షకుల తో కూడా మంచి ర్యాపో పెంచుకున్నాడు సుమన్. వరుస సినిమాలతో తెలుగులోనూ, తమిళంలోనూ ఓ రేంజ్ లో దూసుకువెళ్లే వాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మంచి ఫేమ్ తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీ గా ఉండేవాడు.

ఈ క్రమంలో అప్పట్లో వీరిరువురి మధ్య సినిమా ఆఫర్స్ విషయంలో గొడవలు జరిగేవి అనే పుకార్లు షికార్లు కొట్టాయి. ఇక సుమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి స్పందించాడు. ‘అప్పట్లో పోటీ అనేది నాకు చిరంజీవి గారి మధ్య జరిగేది. కానీ ఎవరికి వారికి ప్రత్యేకమైన కాంపౌండ్ ఉండేదని’ తెలిపాడు సుమన్.

అంతేకాకుండా ఆ సమయంలో చిరంజీవి గారికి రావాల్సిన సినిమా ఆఫర్స్ మీకు వచ్చాయని దాని గురించి మీ ఇద్దరి మధ్య క్లాష్ జరిగింది అనే టాక్ వచ్చిందని ఆ ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా ‘అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే’ అని తెలిపాడు. ‘ఆ టైంలో చిరంజీవికి ఫిక్స్డ్ బ్యానర్స్ ఉండేవని అది ఒక బ్యాచ్’ అని తెలియజేశాడు సుమన్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *