అక్కడ తారక్ ని చూసి ఏడుపొచ్చింది: ఒలివియా

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధానపాత్రలో రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ బాక్సాఫీజ్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్రిటీష్‌ నటి ఒలీవియా మోరీస్‌. తారక్‌ లవ్‌ లేడీ జెన్నీఫర్‌ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు సినీ ప్రియుల్ని ఎంతో ఆకట్టుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌లో భాగంగా తాజాగా ఒలీవియా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్‌ ఆరంభంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకెంతో ఆనందాన్ని అందించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముచ్చెత్తింది ఈ హాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

Olivia Morries intresting comments on Junior Ntr RRR movie

ఎన్టీఆర్ తో కలిసి నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. తారక్ చాలా గొప్ప నటుడని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కొనియాడింది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మొహంలో చిరునవ్వుతోనే సెట్ లోకి అడుగుపెట్టేవాడని, కానీ, ఆయన్ను చూడగానే తనకు టెన్షన్ పట్టుకునేదని తెలిపింది. కొమురం భీముడో పాటలో తారక్‌ను చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయని ఒలీవియా చెప్పింది. ఆ పాటలోని సన్నివేశాలకు తాను భావోద్వేగానికి గురయ్యానంది. చరణ్ మంచి స్నేహితుడయ్యాడని, తామిద్దరం లండన్ లోని పరిసరాల గురించి మాట్లాడుకునేవాళ్లమని తెలిపింది. ‘నాటు నాటు’ పాటకు తన బాయ్ ఫ్రెండ్ డ్యాన్స్ ట్రై చేస్తున్నాడని చెప్పింది. ఇంట్లో ఎప్పుడూ ఆ పాటే పాడుతున్నాడని పేర్కొంది.

  • Olivia Morries intresting comments on Junior Ntr RRR movieæ

RRR ఆడిషన్స్ కోసం వీడియో షూట్ చేసి పంపించానని చెప్పిన ఆమె.. కొన్ని నెలల పాటు టీమ్ నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదని పేర్కొంది. కానీ, ఒకరోజు సడన్ గా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పింది. రాజమౌళి చాలా గొప్ప డైరెక్టర్ అని ఒలీవియా ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్ లో కేవలం 20 రోజులే షూటింగ్ లో పాల్గొన్న ఆమె.. సిటీలో పెద్దగా తిరగలేకపోయానని, సెట్స్ లో అందరూ తనను బాగా చూసుకున్నారని చెప్పింది. ఇక సినిమాల్లో కెరీర్ పరంగా ఒలీవియాకు ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ సినిమా. అయితే, ‘హోటల్ పోర్టోఫినో’ అనే బ్రిటీష్ టీవీ సీరియల్‌తో ఆమె నటనలో అరంగేట్రం చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *