ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్.. వైరల్‌ అవుతున్న ఫోటో..!

సినీఇండస్ట్రీలో తిరుగులేని నటులుగా పేరు గడించారు రజనీకాంత్‌.. కమల్‌హాసన్‌. కెరీర్‌లో రాణిస్తోన్న రోజుల్లో వీరిద్దరూ పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. గత కొంతకాలంగా సినిమా, రాజకీయాలతో బిజీ కావడంతో వీరిద్దరూ ఎక్కువగా కలిసింది లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిస్తే చూడాలని ఆశ పడుతున్న అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. ‘విక్రమ్‌’ సినిమా ఈ స్టార్‌ హీరోలను కలిపింది.

Kamal Haasan meets Rajinikanth at his residence in Chennai

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్‌’. ‘కార్తీ’, ‘ఖైదీ’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ హాస‌న్… త‌న స్నేహితుడు ర‌జినీకాంత్‌ను చెన్నైలోని ఆయ‌న నివాసంలో ఇవాళ‌ క‌లిశారు. డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్‌, ఆర్ మ‌హంద్ర‌న్ కూడా ర‌జనీకాంత్‌ను క‌లిసిన వారిలో ఉన్నారు. ఇంత‌కీ ర‌జినీకాంత్‌ను క‌లవ‌డానికి కార‌ణ‌మేంట‌నే దానిపై అఫీషియ‌ల్ అప్ డేట్ లేదు. అయితే విక్ర‌మ్ టీం స్పెష‌ల్ ప్రీమియ‌ర్‌కు రావాల‌ని తలైవాను ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోండ‌గా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మ‌రోవైపు రజినీకాంత్ విక్ర‌మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏమైనా రాబోతున్నారా..? అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. తెలుగు, త‌మిళం, హిందీతోపాటు ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న విక్ర‌మ్ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. కాగా ఇద్ద‌రు లెజెండ‌రీ యాక్ట‌ర్లు చాలా కాలం త‌ర్వాత ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించిన తాజా చిత్రం ఇపుడు నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *