ఆ ఇద్దరూ లేకుండా నేను ఏమి చేయలేనంటున్న సమంత.. వైరల్ పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సమంత రేంజ్ హై లో ఉంది. ఈమధ్య కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సమంత తిరిగి గతాన్ని తలుచుకోకుండా ముందుకు సాగుతుంది. పైగా ప్రతి ఒక పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో డీగ్లామర్ లుక్ తో కుర్రాళ్లను ఫిదా చేసిన సంగతి తెలిసిందే.

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదే సమయంలో తనతో కలిసి నటించిన నాగ చైతన్య కూడా మాయ చేసి తన వలలో వేసుకుంది. మొత్తానికి చైతుని పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని గడుపుతుండగా.. కొన్ని వ్యక్తిగత విషయాలలో ఇద్దరికి మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు.

చైతును విడిపోయిన తర్వాత సమంత మరింత యాక్టివ్ గా మారింది. చాలావరకు సోషల్ మీడియా వేదికగా తను రిఫ్రెష్ అయ్యింది. మోటివేషనల్ కు సంబంధించిన ఎమోషనల్ కొటేషన్స్ తో మళ్లీ తన జీవితాన్ని కొత్తగా పరిచయం చేసుకుంది. తన గతాన్ని మర్చిపోవడానికి అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి సమయాన్ని గడుపుతుండగా.. దానికి సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది. అందులో తన స్నేహితురాలు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్, కమెడియన్ వెన్నెల కిషోర్ ఉండగా వారితో కలిసి సమంత సోఫాలో పడుకుంది.

రాహుల్ సెల్ఫీ తీయడంతో.. ఆ ఫోటోను పంచుకుంటూ.. ‘మీరు లేకుండా నేను ఏం చేయగలను’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ ఇద్దరిని ట్యాగ్ చేస్తూ.. సులభతరమైన గతం లేని దృఢమైన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు అంటూ మరో స్టోరీ పంచుకుంది. తను పంచుకున్న స్టోరీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. మరోవైపు వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది సమంత.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *