బండ్ల గణేశ్‌ హీరోగా నటించిన సినిమా రిలీజ్‌ అయ్యేది అప్పుడే..!

సైడ్ కారెక్టర్లతో కెరీర్‌ను మొదలు పెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ బ్లాక్ బస్టర్ నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేష్. ఇక ఇప్పుడు హీరోగానూ మారిపోయాడు. బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో డేగల బాబ్జీ అనే చిత్రం రాబోతోంది. తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్‌తో చేసిన సినిమా డేగల బాబ్జీ. ఒకే ప్లేస్‌లో, ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా..కూడా వాళ్ల వాయిస్ మాత్రమే వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు.

Bandla Ganesh’s ‘Degala Babji’ movie release date announced

వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, మే 20 న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో బండ్ల గణేష్ మాట్లాడుతూ… ఒక రూమ్ లో రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్ అని వెల్లడించారు. అలాంటి కథతో దర్శకుడు వెంకట్ చంద్ర తనను హీరోగా పెట్టి ఈ సినిమా తెరకెక్కించాడని తెలిపారు.

‘ఒక రూమ్ లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్. అలాంటి కథను నా భుజాన పెట్టి నాతో చేయించాడు దర్శకుడు వెంకట్ చంద్ర.ఈ సినిమా నిజంగా నా జీవితానికి అర్థం చెప్పే సినిమా అవుతుంది.ఈ సినిమా తర్వాత నాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. సంగీత దర్శకుడు లైనస్ అద్భుతమైన మ్యూజిక్,రీ రికార్డింగ్ ఇచ్చాడు..తమిళ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసి నేషనల్ అవార్డు సాధించిన ‘ఉత్త సిరుప్పు సైజు 7′ సినిమాను తెలుగులో నేను చెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ ట్రైలర్, పోస్టర్ ను విడుదల చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి,హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. మే 20 న వస్తున్న ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు.

https://twitter.com/ganeshbandla/status/1521388623580434433?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1521388623580434433%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fbandla-ganesh-s-degala-babji-movie-release-date-locked-31978

Add a Comment

Your email address will not be published. Required fields are marked *