పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మెగాహీరో వరుణ్‌ తేజ్‌.. లావణ్యతో రిలేషన్?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో మెగాహీరో వరుణ్ తేజ్ కూడా ఒకరు. నిహారిక పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి చూపు వరుణ్ మ్యారేజ్‌పై పడింది. పలు ఇంటర్వ్యూల్లో నాగబాబుకు సైతం వరుణ్ పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం గని. అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం(ఏప్రిల్‌8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సంపాదించుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్‌ హీరో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Mega hero varun tej going to marry lavanya tripathi

కాలేజీ రోజుల్లో లవ్‌స్టోరీ ఉండేది కానీ ఇప్పుడు సీక్రెట్‌ లవ్‌స్టోరీ ఏం లేదని తెలిపాడు. పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు.. చేతిలో చాలా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయని, దీంతో ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని పేర్కొన్నాడు. ఇక ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అన్న దానిపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నాడు. కాగా వరుణ్‌ నటించిన ఎఫ్‌ 3 సినిమా సైతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Mega hero varun tej going to marry lavanya tripathi

అటు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని ఎన్నో రోజుల నుంచి గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు. వీరి గురించి తెలిసిన కొందరు త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నాయని, వరుణ్ – లావణ్య ఒక్కటి కానున్నారంటూ ప్రచారం చేశారు. ఈ పుకార్లతో మాకేంపని అనుకుందో ఏమో లావణ్య త్రిపాఠి.. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం విడుదల నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపింది. సింపుల్‌గా ‘ఆల్‌ ది బెస్ట్’ చెప్పకుండా.. కాస్త ఎక్కువగానే మేటర్ పెట్టడంతో ‘ఇది.. అదే’ అంటున్నారు ఫ్యాన్స్. ‘‘రేపు గనీ విడుదల సందర్భంగా వరుణ్ తేజ్, టీమ్‌కు శుభాకాంక్షలు. మీరు (వరుణ్) ఈ పాత్రకు 110 శాతం శ్రమించారు. మీకు, మీ బృందం పడిన కృషికి మా అద్భుతమైన ప్రేక్షకులు ప్రతిఫలమివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేసింది. దీంతో ఇన్నాళ్లు కేవలం రూమర్ మాత్రమే అనుకున్న అభిమానులు, నిజంగానే వీరి మధ్య ఏదో ఉందనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/Itslavanya/status/1512022284193923073?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1512022284193923073%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fcinema%2Flavanya-tripathi-wishes-varun-tej-for-his-movie-ghani-sparks-dating-rumours-28734

Add a Comment

Your email address will not be published. Required fields are marked *